Hyderabad, ఫిబ్రవరి 11 -- రోజువారీ ఆహారంలో కచ్చితంగా తినాల్సినది పెరుగు ఒకటి. దీన్ని రోజూ మీరు ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ శరీరానికి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. పెరుగు అనేక పోషకాలతో నిండి ఉంటుంది. పెరుగుతోనే మజ్జిగ, వెన్న, నెయ్యి ఇలా ఎన్నో తయారు చేస్తారు. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి శీతలీకరణ ప్రభావం పడుతుంది.

కొవ్వుతో కూడిన పెరుగును తీసుకోవడం కూడా మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పెరుగును యోగర్ట్ అని, కర్డ్ అని కూడా అంటారు. ఇది పోషకాల నిధి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకోండి.

పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది పొట్ట ఆరోగ్యానికి సహాయపడుతుం...