భారతదేశం, ఫిబ్రవరి 9 -- డాకు మహరాజ్ చిత్రం కలెక్షన్లలో అదరగొట్టింది. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు చూపింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన రిలీజైంది. ప్రేక్షకులకు మెప్పించి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంచనాలను అందుకుంది. అయితే, డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ నిరాశ ఎదురైంది.

డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై రూమర్లు బలంగా వచ్చాయి. ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 9న నేడు స్ట్రీమింగ్‍కు రానుందంటూ అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో చాలా మంది నిరీక్షించారు. అయితే, ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నేడు అడుగుపెట్టలేదు. స్ట్రీమింగ్ రావడం ఆలస్యమైంది.

డ...