భారతదేశం, ఫిబ్రవరి 1 -- నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యాక్షన్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించింది. ఈ యాక్షన్ మూవీకి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. అయితే, ఈలోగానే ఓటీటీ ప్రింట్‍లా హెచ్‍డీ వెర్షన్ లీక్ అయింది.

డాకు మహారాజ్ చిత్రం హెచ్‍డీ వెర్షన్ ఆన్‍లైన్‍లో లీక్ అయింది. మూవీ రిలీజయ్యాక ఈ మూవీ లీక్ కాగా.. ఇప్పుడు తాజాగా మరో హెచ్‍డీ ప్రింట్ వెర్షన్ పైరసీ సైట్లలో కనిపిస్తోంది. ఏకంగా ఓటీటీల్లో ఉండే లాంటి ప్రింట్ లీకైపోయింది. ఓటీటీ స్ట్రీమింగ్‍కు ముందే హెచ్‍డీ వెర్షన్ వచ్చేయడం షాకింగ్‍గా మారింది.

ఇటీవలి కాలంలో హెచ్‍డీ వెర్షన్‍ల లీక్ బెడద పెరిగిపోతోంది. పుష్ప 2, గేమ్ ఛేంజర్ చిత్రాల హెచ్‍డీ వెర్షన్...