భారతదేశం, ఫిబ్రవరి 16 -- డాకు మహారాజ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు అధికారికంగా వెల్లడైంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజైంది. మంచి హిట్ కొట్టింది. అయితే, ఓటీటీ స్ట్రీమింగ్ మాత్రం అనుకున్న దాని కంటే ఆలస్యమైంది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారైంది. అయితే, ఓ విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఆ వివరాలు ఇవే..

డాకు మహరాజ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఓటీటీలో డాకు మహరాజ్ చిత్రానికి అదనపు సీన్లు యాడ్ అవుతాయనే రూమర్లు ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. థియేట్రికల్ వెర్షన్‍తో పోలిస్తే మరింత ఫుటేజ్ ఓటీటీలో ఉంటుందనే పుకార్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయంపైనే ...