భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిలీజ్ డేట్ రివీలైంది. ఫిబ్ర‌వ‌రి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్ష‌న్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ యాక్ష‌న్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

డాకు మ‌హారాజ్ మూవీకి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్ర‌ద్ధాశ్రీనాథ్‌, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు బాబీడియోల్ విల‌న్‌గా క‌నిపించాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ సూప‌ర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద 115 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

డాకు మ‌హారాజ్‌గా బాల‌కృష్ణ క్యారెక్ట‌రైజేష‌న్‌, యాక్టింగ్‌తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. త‌మ‌న్ ఈ సినిమాకు మ్యూజ...