భారతదేశం, సెప్టెంబర్ 27 -- డీఏ (డియర్​నెస్​ అలొవెన్స్​) పెంపు వార్తల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణ కొనసాగుతోంది! ఇటీవలే ముగిసిన కేంద్ర కేబినెట్​ సమావేశంలో డీఏ పెంపుపై ప్రకటన వెలువడుతుందన్న ఆశాలు నెరవేరలేదు. అయితే, డీఏ పెంపు సహా 8వ వేతన సంఘంపై ఇప్పుడు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. దీపావళి నాటికి ఈ రెండు విషయాలపై కేంద్రం కీలక ప్రకటనలు చేస్తుందని తెలుస్తోంది.

డీఏ, డీఆర్​ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచేందుకు నియమించిన 8వ వేతన సంఘం ప్యానెల్​ ఏర్పాటుపై దీపావళి నాటికి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

8వ వేతన సంఘానికి టీఓఆర్​ (టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​) రావాల్సి ఉంది. దీపావళికి ముందు ఈ అనుమతి వస్తుందని తెలుస్తోంది. టీఓఆర్​ క్లియరెన్స్​ లభిస్తే 8వ వతన సంఘం అధికారికంగా ఏర్పాటైనట్టు అవుతుంది. అనంతరం ఈ సంఘంలోని ప్యానెల్​ సభ్య...