భారతదేశం, ఫిబ్రవరి 2 -- Cyber Crime : సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రస్తుతం అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టకండి, ఎవరో చెప్పింది విని లేదా సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోకండన్నారు.

మీరు పెట్టుబడి పెట్టండి, మీ బంధుమిత్రులతో పెట్టుబడి పెట్టించి అధిక లాభాలు పొందండి అంటూ ఆశ చూపించే చైన్ ఇన్వెస్ట్మెంట్ మోసపూరితమైనదని గ్రహించాలని ఎస్పీ కోరారు. మెదక్ జిల్లాలో సైబర్ నేరాలు ఎక్కువ కావటంతో, ప్రజలందరూ ఇలాంటి నేరాల పైనా అలర్ట్ గా ఉండాలని పిలుపునిచ్చారు.

ఎవరైనా కొత్త వ్యక్తులు మీకు క్యూఆర్ కోడ్ పంపించి దాన్ని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్తే నమ్మకండ...