భారతదేశం, ఫిబ్రవరి 3 -- కరివేపాకుతో పౌడర్ తయారు చేసుకుని తింటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనితోపాటుగా అందులో కాస్త ధనియాల పొడి, జీలకర్ర, పసుపు, కారం కూడా చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ మసాలా దినుసులన్నీ నిర్ణీత నిష్పత్తిలో కలపాలి. ఈ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పొడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పౌడర్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. కర్రీ పౌడర్ ఆహారంలో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

మన శరీరం మలినాలను పోగు చేసుకుంటూ క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ని కలిగి ఉంటుంది. ఇవి ఎప్పటికప్పుడు శరీరం నుండి విసర్జించబడాలి. లేకుంటే అనేక వ్యాధులకు దారితీస్తుంది. కర్రీ పౌడర్ ఆహారంలో కలపడం వల్ల మలినాలను తొలగించడంతోపాటు అవి పేరుకు...