Hyderabad, ఫిబ్రవరి 14 -- పెరుగు తినడం ఎంతో ఆరోగ్యకరం. భోజనం పెరుగుతోనే ముగ్గుస్తుంది. అప్పుడే సంపూర్ణ భోజనం పూర్తయినట్టు. అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు రుచిలో కూడా తృప్తిని ఇస్తుంది. ఇంట్లోనే పెరుగును తయారుచేసుకుంటారు. అయితే పాలను తోడుపెట్టాక కనీసం 8 గంటలు సమయం పడుతుంది చిక్కటి పెరుగు తయారవ్వడానికి. ఇంట్లో ఉన్న పెరుగు కన్నా మార్కెట్లో ఉన్న పెరుగు చిక్కగా ఉంటుంది. ఇంట్లోనే పావు గంటలో పెరుగును తయారుచేసుకునే చిట్కాను ఇక్కడ మేము చెబుతున్నాము. ఈ పెరుగు మార్కెట్‌లో దొరికేలా గడ్డకట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఈ అద్భుతమైన కిచెన్ టిప్స్ తెలుసుకుందాం.

మార్కెట్‌లో దొరికేలా గడ్డ పెరుగును త్వరగా తయారు చేయడానికి, ముందుగా పాలు వేడి చేయడానికి గ్యాస్ మీద ఉంచండి. పాలు మరిగేంత వరకు ఉడికించండి. పాలు బాగా మరిగితే పెరుగు...