భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ కెప్టెన్ ఇంట్లోకి ఆడపిల్ల వచ్చేసింది. అతని భార్య రెబెకా (బెక్కీ) పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన కమిన్స్ దంపతులు ఆ పాపకు హృదయపూర్వక స్వాగతాన్ని పలికారు.

రెబెకా పాపకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని, ఆ పాప ముఖం వైపు ప్రేమగా చూస్తున్న ఫొటోను బెక్కీ కమిన్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ''మా అందమైన బేబీ గర్ల్ ఎడి ఇక్కడికి వచ్చేసింది. మేం ఎంతటి ప్రేమను ఫీల్ అవుతున్నామో, ఎంతలా ఉప్పొంగిపోతున్నామో మాటల్లో వర్ణించలేం'' అని ఆ పోస్టులో రెబెకా రాసుకొచ్చింది.

భార్య రెబెకా డెలివరీ సమయంలో దగ్గర ఉండటం కోసం శ్రీలంకతో సిరీస్ కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇప్పటికే ఆల్బీ...