భారతదేశం, జనవరి 15 -- సీయూఈటీ పీజీ 2026-27కి దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. సీయూఈటీ పీజీకి ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు రెండో అవకాశం ఇచ్చారు. ఎన్టీఏ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌ ప్రకారం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 14వ తేదీ రాత్రి 11.50 గంటలతో ముగిసింది. జనవరి 20, 2026 వరకు దరఖాస్తు గడువును పొడిగించారు. అలాగే జనవరి 23 నుంచి 25 వరకు దిద్దుబాట్లు చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చింది.

CUET PG 2026 కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు మొదట అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ తరువాత వారు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను అందుకుంటారు. దీనిని ఉపయోగించి దరఖాస్తు ఫారమ్ పూరించవచ్చు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి ...