Hyderabad, ఏప్రిల్ 5 -- వేసవి వచ్చిందంటే చలువ చేసే ఆహార పదార్థాలను తినాలని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి చలువు చేసే ఆహారాల్లో కీరదోస ఎల్లప్పుడూ ముందుంటుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా కీరదోస చాలా బాగా సహాయపడుతుందని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తారు. నిజానికి నీటి శాతం, ఫైబర్, విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియంతో పాటు ఇతర ముఖ్య పోషకాలు కలిగి ఉండే కీరదోస శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో కొన్ని ఏంటంటే..

కీరదోస తినడం వల్ల అనేక లాభాలున్నాయి. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండి, నీటితో సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది, ముఖ్యంగా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో కీరదోస తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది....