Hyderabad, మార్చి 25 -- కీరాదోస వేసవిలోనే అధికంగా వస్తుంది. దీంతో చేసే రోటీలు టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము కీరాదోస రోటి రెసిపీ ఇచ్చాము. ఇది బ్రేక్ ఫాస్ట్ లోను, డిన్నర్ లోను కూడా అద్భుతంగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది పెద్దగా నూనెను పీల్చదు. కాబట్టి అందరూ తినవచ్చు. కీరాదోసతో చేసే ఈ రోటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కీరాదోస - రెండు

వరి పిండి - రెండు కప్పులు

ఉప్మా రవ్వ- రెండు స్పూన్లు

క్యారెట్ - ఒకటి

కొత్తిమీర తురుము - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - రెండు

అల్లం - చిన్నముక్క

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - ఒక స్పూను

1.కీరాదోస రోటి చేయడానికి పెద్ద కీరాను ఒకటి తీసుకోవచ్చు. లేదా చిన్నవి అయితే రెండు తీసుకోవచ్చు.

2. వాటిని సన్నగా తురిమి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇది తురుముతున్నప్పుడే నీళ్ళలా అయిపోతుంది.

3. ఆ తురిమిన కీర...