తెలంగాణ,హైదరాబాద్, మార్చి 19 -- సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం హైద‌రాబాద్‌ లోని సీఎస్ఐఆర్- జాతీయ‌ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 19 ఖాళీలను భర్తీ చేయనుంది. ఓపెన్ కోటాలో 8 ఖాళీలు ఉన్నాయి. మార్చి 17వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా...ఏప్రిల్ 21వ తేదీ(సాయంత్రం 6) వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చారు. రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ,మహిళ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వీరిలో అర్హులైన వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. విద్యా అర్హతలే కాకుండా పని అనుభవంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపిక ప్రక్రియను స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది.

Published by HT Digital Content S...