భారతదేశం, ఏప్రిల్ 7 -- ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన 'టారీఫ్​' షాక్​తో స్టాక్​ మార్కెట్లు మాత్రమే కాదు, క్రిప్టో కరెన్సీలు కూడా విలవిలలాడుతున్నాయి. ప్యానిక్​ సెల్లింగ్​ కారణంగా క్రిప్టోలు అత్యంత భారీగా పతనమయ్యాయి. పలు నివేదికల ప్రకారం గత 24 గంటల్లో 745 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలను అమ్మేశారు. ఇది దాదాపు ఆరు వారాల్లో అత్యధికమని తెలుస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్​కాయిన్ ఏప్రిల్ 7న సింగపూర్​లో ప్రారంభమైన మార్కెట్లలో 7 శాతం క్షీణించి 77,077 డాలర్లకు పడిపోయింది. రెండో అతిపెద్ద క్రిప్టో అయిన ఎథేరియం 2023 అక్టోబర్ తర్వాత ఇంట్రాడే కనిష్ట స్థాయికి పడిపోయి 1,538 డాలర్లకు చేరింది.

ఏప్రిల్ 7న ప్రపంచ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) 2.5 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత 24 గంటల్లో 6.59 శాతం...