భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షంతో రద్దయింది. రావల్పిండి స్టేడియంలో మంగళవారం (ఫిబ్రవరి 25) జరగాల్సిన మ్యాచ్ ను వరుణుడు తుడిచిపెట్టేశాడు. ఒకవేళ వర్షం తగ్గినా కటాఫ్ టైం లో మైదానాన్ని ఆటకు సిద్ధం చేసే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దుచేశారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు.

రావల్పిండి స్టేడియంలో వర్షం పడుతున్నా గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం పిచ్, దాని చుట్టుపక్కలా కవర్లు పరిచారు. మిగతా గ్రౌండ్ మొత్తం వదిలేశారు.

''రావల్పిండి గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేయకపోవడం సిగ్గుచేటు. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా ఓ ముఖ్యమైన మ్య...