భారతదేశం, ఏప్రిల్ 11 -- ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ప్రఖ్యాత దర్శకుడు మాథ్యూ వాన్ తో కలిసి యూఆర్.మార్వ్ (UR*Marv) అనే జాయింట్ ఫిల్మ్ స్టూడియోను ప్రారంభించాడు. 40 ఏళ్ల రొనాల్డో ఈ విషయాన్ని తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ వార్తను పంచుకున్నాడు. తన కెరీర్ లోని ఈ మార్పును ''ఎక్సైటింగ్ ఛాప్టర్ (ఉత్తేజకరమైన అధ్యాయం)" అని రొనాల్డో చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ లో రొనాల్డో అడుగుపెట్టడంతో అతని నెట్ వర్త్ పై చర్చ జోరందుకుంది.

జోనల్ స్పోర్ట్స్ ప్రకారం ఆల్ టైమ్ ఫుట్‌బాల్ లెజెండ్లలో ఒకడైన రొనాల్డో నికర విలువ (నెట్ వర్త్) సుమారు 800 మిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ ప్రకారం.. ఐదు సార్లు బాలోన్ డి'ఓర్ విజేతగా నిలిచిన రొనాల్డో 2020 లో 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ జీతం సంపాదించిన మొదటి యాక్టివ్ టీమ్-స్పోర్ట్స్ ఆటగాడిగా...