భారతదేశం, ఏప్రిల్ 13 -- సౌదీ ప్రో లీగ్ టైటిల్ రేసులో అల్-నాసర్ టీమ్ ఆశలను సజీవంగా ఉంచేలా ఫుట్‌బాల్‌ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సూపర్ గోల్ కొట్టాడు. అల్-రియాద్ పై సంచలన గోల్ చేశాడు. రెండు గోల్స్ తో టీమ్ ను గెలిపించాడు. సెకండాఫ్ లో రొనాల్డో కొట్టిన వరల్డ్ క్లాస్ కిక్ ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. ఆ మెరుపు గోల్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

సౌదీ ప్రో లీగ్ లో క్రిస్టియానో రొనాల్డో మ్యాజిక్ కొనసాగుతోంది. అల్ నాసర్ తరపున ఈ స్టార్ సంచలన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అల్ రియాద్ పై రెండు గోల్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో అల్ నాసర్ 2-1 తేడాతో అల్ రియాద్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 56వ, 64వ నిమిషాల్లో రొనాల్డో గోల్స్ నమోదు చేశాడు.

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో రొనాల్డో గోల్స్ మోత కొనసాగుతూనే ఉంది. 1000 గోల్స్ రికార్డుపై కన్నేసిన ఈ ఫుట్‌బాల్‌ స్టార్.. ఖాతాలో ప్...