భారతదేశం, మార్చి 3 -- క్రిస్టియానో రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్ లకు స్టార్ అట్రాక్షన్ గా కొనసాగుతున్నాడు. అతని కోసం క్లబ్ లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ జట్టు అల్ నాసర్ క్లబ్ తరపున రొనాల్డో ఆడుతున్నాడు. ఈ క్లబ్ తో అతని కాంట్రాక్టస్ ముగిసేందుకు చివరి దశలో ఉంది. దీంతో రొనాల్డో కోసం క్లబ్ లు క్యూ కడుతున్నాయి. కానీ అల్ నాసర్ క్లబ్.. రొనాల్డోను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలిసింది.

రొనాల్డో ను తమ జట్టులో ఆడించేందుకు బ్రెజిల్ లీగ్ కు చెందిన పోర్చుగీసా జట్టు ఇంట్రస్ట్ చూపిస్తోంది. పౌలిస్టా ఏ1 జట్టు పోర్చుగీసా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. పోర్చుగీస్ దేశానికి చెందిన రొనాల్డోను పోర్చుగీసా క్లబ్ కు ఆడించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1000 ఫ్రొఫెషనల్ గోల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రొనాల్డో.. ఇప్పటివరకూ 925 గోల...