భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజాల్లో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో ఇప్పటివరకూ ఒక్క టాటూ కూడా వేయించుకోలేదంటే మీరు నమ్ముతారా? కానీ అదే నిజం.ఈ పోర్చుగల్ ఆటగాడు అసలు పచ్చబొట్ల జోలికే వెళ్లలేదు. దీని వెనుక ఓ మంచి కారణం ఉంది. రక్తదానం చేయడం కోసమే రొనాల్డో టాటూల జోలికి వెళ్లలేదు. తన శరీరంపై ఒక్క ఇంక్ చుక్క ను అతను పొడిపించుకోలేదు.

గ్రౌండ్ లో అద్భుతమైన ప్రదర్శనతో సాగే రొనాల్డో.. బయట కూడా తన మేటి వ్యక్తిత్వంతో అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. రక్త దానం చేయడం కోసమే టాటూలకు దూరంగా ఉండి తనది గ్రేట్ హార్ట్ అని చాటుకున్నాడు. టాటూలు వేయించుకుంటే రక్త దానం చేసే ముందు వెయిటింట్ పిరియడ్ ఫాలో కావాల్సి ఉంటుంది. టాటూల వల్ల ఈ ఇబ్బంది ఉండకూడదని రొనాల్డో అసలు పచ్చబొట్ల జోలికే వెళ్లలేదు.

ఫుట్ బాల్ స్టార్ రొనాల్డో క్రమం తప్పకుండా రక్త దానం చేస్తు...