Hyderabad, మార్చి 19 -- Crime Thriller Web Series: కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఈ సిరీస్ పేరు కర్మ (Karma). ఈ వెబ్ సిరీస్ కొత్త పోస్టర్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ బుధవారం (మార్చి 19) అనౌన్స్ చేసింది. వచ్చే నెల మొదటి వారంలో ఈ సరికొత్త వెబ్ సిరీస్ ఈ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కర్మ అనే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి బుధవారం నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. "విధి ఆడించే ఆటకు అందరికీ స్వాగతం. ఇక్కడ ప్రతి ప్లేయర్ తగిన మూల్యం చెల్లిస్తారు. క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ కర్మ ఏప్రిల్ 4న రానుంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్వీట్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ అంటేనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్, సినిమాలకు పెట్టింది పేరు. అలాంటి ఓటీటీలోఇప్పుడు మరో కొరియన్ క్రైమ్ ...