Hyderabad, మార్చి 12 -- Crime Thriller Web Series: తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సుడల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ రెండు సీజన్లకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అలాంటిదే మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. దీని పేరు ఓం కాళీ జై కాళీ.

ఓం కాళీ జై కాళీ పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది. ఇది జియోహాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ తమిళ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (మార్చి 11) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

గతంలో చట్నీ సాంబార్, పారాచూట్, ఉప్పు పులి కారం, గోలీ సోడా రైజింగ్ లాంటి తమిళ వెబ్ సిరీస్ తీసుకొచ్చిన జియోహాట్‌స్టార్.. ఇప్పుడీ ఓం కాళీ జై కాళీ పేరుతో మరో సిరీస్ తీస...