భారతదేశం, మార్చి 19 -- మరో సూపర్ హిట్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రెడీ అయిపోయింది. బ్లాక్‍బస్టర్ సాధించిన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' మూవీ మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. కుంచకో బోబన్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న మలయాళం రిలీజై బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మార్చి 14 తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు మరొక్క రోజులో ఓటీటీలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ అడుగుపెట్టనుంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. మంచి హిట్ సాధించటంతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై బాగా బజ్ నడిచింది. మంచి హైప్ మధ్యే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం ఈ అర్ధరాత్రి (మార్చి 20) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరికొన్ని గంటల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడు...