భారతదేశం, ఫిబ్రవరి 11 -- షకీబ్ సలీం ప్రధాన పాత్ర పోషించిన 'క్రైమ్ బీట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు రెడీ అయింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍కు సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సిరీస్ క్యూరియాసిటీ పెంచింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 11) రిలీజ్ అయింది.

జర్నలిస్టుగా ఫేమస్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రైమ్ రిపోర్టర్ అభిషేక్ సిన్హా (షకీబ్ సలీమ్) చుట్టూ క్రైమ్ బీట్ సిరీస్ సాగుతుంది. విదేశాలకు పారిపోయి మళ్లీ ఢిల్లీకి వచ్చే బిన్నీ చౌదరి (రాహుల్ భట్) అనే ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‍ గురించి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిసైడ్ అవుతాడు జర్నలిస్టు అభిషేక్. ఓ కేసు విషయంలో తీవ్రంగా దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటాడు. విషయాలను తెలుకునే కొద్దీ అతడికి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అయినా ...