భారతదేశం, ఫిబ్రవరి 19 -- Crime Thriller OTT: ర‌జ‌నీకాంత్ క‌బాలి ఫేమ్ సాయిధ‌న్సిక హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ద‌క్షిణ‌ థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స‌య్యాయి. ఫిబ్ర‌వ‌రి 21న ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీలో ద‌క్షిణ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా విడుద‌ల తేదీని ల‌య‌న్స్ గేట్ ప్లే అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ టాలీవుడ్‌ మూవీకి ఓషో తుల‌సీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రిష‌బ్ బ‌సు, స్నేహా సింగ్‌, మేఘ‌న చౌద‌రి కీల‌క పాత్ర‌లో న‌టించారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ద‌క్షిణ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. సాయిధ‌న్సిక యాక్టింగ్, కొన్ని ట్విస్ట్‌లు బాగున్నా... సైకో కిల్ల‌ర్ సినిమాల్లో ఉండే థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌, లాజిక్స్ మిస్స‌వ్వ‌డంతో ద‌...