భారతదేశం, మార్చి 24 -- ఉత్తర్​ప్రదేశ్​ లక్నోలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు?' అని అడిగిన ఓ వృద్ధురాలిని, ఓ 22ఏళ్ల వ్యక్తి కిరాతకంగా కొట్టి చంపేశాడు.

మార్చ్​ 15న లక్నోలోని గోసాయిగంజ్​ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

"తుషాల్​ అలియాస్​ విశాల్​ వర్మ.. పబ్లిక్​లో మూత్రం పోశాడు. అదే సమయంలో 62ఏళ్ల జాగ్రానా అతడిని అడ్డుకుంది. బహిరంగ ప్రదేశంలో ఎందుకు మూత్రం పోస్తున్నావు అని అడిగింది. వారిద్దరి మధ్య అది అప్పటికే రెండో సంఘటన. తుషాల్​​కి చాలా కోపం వచ్చింది. గోసాయిగంజ్​లోని ఒక పాడుబడిన ఇంట్లోకి వృద్ధురాలిని లాక్కెళ్లాడు. మెటల్​ రాడ్​తో ఆమె తల, ముఖాన్ని చాలాసార్లు కొట్టాడు. ఇటుకతో ఆమె తలపై దాడి చేశాడు. చివరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది," అని డీసీపీ సౌత్​ నిపుణ్​ అగర్వాల్​ తెలిపారు.

ఎల్​ఎల్...