భారతదేశం, మార్చి 9 -- పాకిస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చాట్​ నుంచి తీసేశాడన్న కోపంతో, వాట్సాప్​ గ్రూప్​ అడ్మిన్​ని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు! పోలీసులు అతడిని ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు.

పాకిస్థాన్​లోని ఖైబర్​ పఖ్తుంఖ్వ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ముస్తఖ్​ అహ్మద్​ అనే వ్యక్తి వాట్సాప్​లో ఒక గ్రూప్​కి అడ్మిన్​గా ఉన్నాడు. అదే గ్రూప్​లో ఉన్న అష్ఫఖ్​ అనే వ్యక్తితో గ్రూప్​లో అతనికి గొడవైంది. ఫలితంగా అష్ఫఖ్​ని ఆ వాట్సాప్​ గ్రూప్​ నుంచి తొలగించాడు. ఇది అష్ఫఖ్​కి నచ్చలేదు. ముస్తఖ్​పై కోపం పెంచుకున్నాడు.

గురువారం సాయంత్రం.. గొడవను పరిష్కరించుకుందామని చెప్పి ముస్తఖ్​ని పిలిపించాడు అష్ఫఖ్​. కానీ అష్ఫఖ్​ తనతో పాటు గన్​ తీసుకెళ్లి.. ముస్తఖ్​ని చంపేశాడు. ఈ విషయాన్ని ముస్తఖ్​ సోదరుడు పోలీసులకు చెప్పాడు.

"ఆ గొడవ పెద్ద విషయమే కాదు. చ...