భారతదేశం, ఏప్రిల్ 23 -- Teen kills friend fo ex girlfriend : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని స్నేహితుడు డేటింగ్​ చేస్తున్నాడని ఓ వ్యక్తి అనుమానించాడు. సిగరెట్​ తాగుదామని పిలిచి.. ఆ 16ఏళ్ల స్నేహితుడిని కిరాతకంగా పొడిచి, పొడిచి చంపేశాడు!

మహారాష్ట్రలోని ఘట్కోపర్​లో ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు రుషికేశ్​ గౌరవ్​. అతని వయస్సు 19ఏళ్లు. అతనికి ఒక గర్ల్​ఫ్రెండ్​ ఉండేది. ఆమె ఒక మైనర్​. ఇటీవలి కాలంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో.. ఘట్కోపర్​ నుంచి థానేలోని దివా అనే ప్రాంతానికి వలస వెళ్లాడు రుషికేశ్​. అప్పటి నుంచి.. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది.

అదే సమయంలో.. తన 16ఏళ్ల స్నేహితుడు శ్రవణ్​ సలావే.. తన గర్ల్​ఫ్రెండ్​ని డేట్​ చేస్తున్నాడని అనుమానించాడు రుషికేశ్​. ఆ అనుమాలను మరింత బలపరిచే...