భారతదేశం, ఏప్రిల్ 6 -- బెంగళూరు నడిరోడ్డు మీద అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! అందరు చూస్తుండగానే, ఓ మహిళను- ఆమె భర్త గొంతు కోసి చంపేశాడు. ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆ వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడు.

బెంగళూరులోని ఎలక్ట్రానిక్​ సిటీ సమీపంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు పేరు కృష్ణప్ప. అతని వయస్సు 43. అతని భార్య కే శారద వయస్సు 35ఏళ్లు. ఆమె బెంగళూరులో డొమెస్టిక్​ వర్కర్​గా పనిచేస్తోంది.

కాగా కృష్ణప్ప బగెపల్లి కూలీ పని చేసుకుంటున్నాడు. కానీ అతనికి తన భార్య మీద అనుమానాలు చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే ఆమెను చంపేందుకు బగెపల్లి నుంచి శుక్రవారం బెంగళూరుకు వచ్చాడు. నడ్డిరోడ్డు మీద, ప్రజల మధ్యలో ఆమెను అడ్డుకున్నాడు. ఆమెతో గొడవకు దిగాడు. చివరికి ఆమె గొంతు కోసేశాడు. ఆ మహిళ నేల మీద కుప్పకూలి పోయి, చివరికి ప్రాణాలు...