భారతదేశం, మార్చి 16 -- మధ్యప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! ఒకే గ్రామానికి చెందిన 200కుపైగా మంది ఓ వ్యక్తిని కిడ్నాప్​ చేశారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా ఆ గ్రామస్థులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం ఇద్దరు మరణించారు.

మధ్యప్రదేశ్​ గాద్రా గ్రామానికి చెందిన వార్త ఇది. 52ఏళ్ల అశోక్​ కోల్​ కుటుంబం, 24ఏళ్ల సన్నీ ద్వివేదీ కుటుంబ దగ్గర భూమిని లీజుకు తీసుకుని పొలం పనులు చేసేది. ఆ తర్వాత ద్వివేదీ కుటుంబం భూమి పక్కనే అశోక్​ తన సొంతంగా ఒక ల్యాండ్​ కొనుగోలు చేశాడు. అయితే, ఈ భూమిపై ద్వివేదీ కుటుంబం కన్నుపడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి.

రెండు నెలల క్రితం 52ఏళ్ల అశోక్​ కోల్​ అనూహ్యంగా మరణించాడు. మౌగంజ్​ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది....