భారతదేశం, ఫిబ్రవరి 18 -- Crime news: ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే తన తండ్రి తన తల్లిని హత్య చేశాడని ఆమె నాలుగేళ్ల కూతురు తన డ్రాయింగ్ ద్వారా వివరించింది. తమ కూతురిని కొన్నేళ్లుగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని, చివరకు హత్య చేశారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యూపీలోని ఝాన్సీలో ఉన్న కొత్వాలి ప్రాంతంలోని పంచవటి శివ్ పరివార్ కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ఆ బాధిత 27 ఏళ్ల యువతిని ఆమె భర్త హత్య చేసినట్లు ఆ యువతి నాలుగేళ్ల కూతురు వాంగ్మూలం ద్వారా పోలీసులు నిర్ధారించారు. తన తల్లిని హత్య చేసి, ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ఆ చిన్నారి వాంగ్మూలం ఇచ్చింది. అంతేకాకుండా, సంబంధిత ఘటనను డ్రాయింగ్ వేసి చూపింది. ''నాన్న మమ్మీని కొట్టి చంపేశాడు. రాయితో తలపై కొట్టాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ...