భారతదేశం, మార్చి 6 -- Crime news: ఐదేళ్ల కూతురిని గొంతు నులిమి చంపి, ఆమె మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి చంపిన 40 ఏళ్ల వ్యక్తిని ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోహిత్ మిశ్రా తనతో గొడవపడిన పొరుగింటి వ్యక్తి ఇంటికి తన కుమార్తె తాని వెళ్లడంతో ఆగ్రహానికి గురై ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. కూతురిని హతమార్చిన తరువాత, తానే స్వయంగా తన కూతురు కనిపించడం లేదని మిశ్రా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు.

మిశ్రా ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి నాలుగు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం గాలించారు. గాలింపులో భాగంగా వారు ఓ శరీర భాగాన్ని కనుగొన్నారు. మరుసటి రోజు మరిన్ని అవశేషాలు లభించాయి. దాంతో ఆ బాలిక హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక తండ్రిని లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడిం...