Hyderabad, మే 23 -- Crew OTT Release Date: ఓటీటీలో ఈ వీకెండ్ మనల్ని టైంపాస్ చేయడానికి మరో బాలీవుడ్ మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అతి కొద్ది సినిమాల్లో ఒకటి క్రూ (Crew). టబు, కరీనా కపూర్, కృతి సనన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది.

బంగారం స్మగ్లింగ్ చేసే ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ల చుట్టూ తిరిగే క్రూ (Crew) మూవీ థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. అందులోనూ బాలీవుడ్ కు చెందిన ముగ్గురు సీనియర్ హీరోయిన్లు టబు, కరీనా కపూర్, కృతి సనన్ నటించిన మూవీ ఇది. ఈ సినిమా శుక్రవారం (మే 24) నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.

రాజేష్ ఎ కృష్ణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్, కమ్యూనికేషన్ నెట్‌...