భారతదేశం, ఫిబ్రవరి 19 -- క్రెడిట్​ స్కోర్​ అనేది ఫైనాన్షియల్​ ప్రపంచంలో చాలా ముఖ్యం! లోన్​ తీసుకోవాలన్నా, లోన్​ ఇవ్వాలన్నా ఈ క్రెడిట్​ స్కోర్​ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్​ స్కోర్​ అనేది మీ క్రెడిట్ అర్హతను సూచించే మూడు అంకెల సంఖ్య.

తక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే క్రెడిట్​ అర్హత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో క్రెడిట్​ స్కోర్​ ఎక్కువగా ఉంటే, క్రెడిట్ అర్హత ఎక్కువగా ఉంటుంది. బ్యాంకులు ఎవరికైనా రుణాలు ఇవ్వడానికి ముందు, అవి ఒక వ్యక్తి క్రెడిట్ స్కోర్ ద్వారా అతని / ఆమె క్రెడిట్ అర్హతను అంచనా వేస్తాయి.

క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే, సదరు వ్యక్తి ఆర్థికంగా దృఢంగా ఉన్నారని బ్యాంక్​లకు అర్థమవుతుంది. కాబట్టి రుణాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికైనా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఆర్థికంగా బలంగా లేడని అర్థం, తద్వారా ఆ వ్...