భారతదేశం, ఫిబ్రవరి 2 -- CPM on Budget : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌ కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు ఉపయోగపడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు విమర్శించారు. బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు . ఆదివారం సంగారెడ్డి పట్టణంలో జరిగిన నిరసన, దిష్టి బొమ్మ దగ్ధం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బడ్జెట్ బడా కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలను కాపాడే విధంగా ఉందని చుక్కా రాములు విమర్శించారు.

సామాన్య ప్రజలకు నేరుగా లబ్ది కల్పించేందుకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. వేతన జీవులను పెద్దఎత్తున సంతృప్తి పరుస్తామంటూ గొప్పలు చెప్పి ముష్టి వేసినట్టు ఊరట కల్పించారని విమర్శలు చేశారు. దేశ ప్రజల బడ్జెట్‌ అంటూ ప్రధాని మోదీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ...