ఆంధ్రప్రదేశ్,విజయవాడ, మార్చి 28 -- ఇళ్ల స్థలాలు, టిడ్కో కేటాయింపు ఇళ్ల పట్టాలు, రిజిస్ట్రేషన్ కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. సీపీయం నగర కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు పాల్గొన్నారు. మండుటెండను లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ప్రభుత్వం వెంటనే ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు.

ఏడు సంవత్సరాల క్రితం డబ్బు చెల్లించినప్పటికీ. ఇప్పటివరకు ఇల్లు రాలేదని టిడ్కో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల పేరుతో 35,000 వసూలు చేసి ఖాళీ స్థలాలు కూడా చూపించలేదన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్ పేరుతూ ఎన్నిరోజులు కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. ధర్నా చేస్తున్న ప్రజల వద్దకు డిఆర్ఓ లక్ష్మీనరసింహం వచ్చి దరఖాస్తుల స్వీకరించారు. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చా...