భారతదేశం, ఏప్రిల్ 6 -- వామపక్ష పార్టీ సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబీ ఎన్నికయ్యారు. ఇఎంఎస్ నంబూద్రిపాద్ తర్వాత ఈ పదవిని చేపట్టిన కేరళ నుండి రెండో నాయకుడు ఆయన. బేబీ మైనారిటీ సమాజం నుండి వచ్చిన మొదటి సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, ఆయన రాజకీయ ప్రయాణం విద్యార్థి రాజకీయాలతో ప్రారంభమైంది. రాజ్యసభలో కూడా పనిచేశారు. కేరళలో విద్యా మంత్రిగా కూడా చేశారు.

తమిళనాడులోని మధురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్‌లో ఎంఎ బేబీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 75 ఏళ్లలోపు అత్యంత సీనియర్ కేంద్ర కమిటీ నాయకులలో ఎంఎ బేబీ (70) ఒకరు. గత సెప్టెంబర్‌లో సీతారాం ఏచూరి మరణం తర్వాత పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమన్వయకర్తగా నియమితులైన మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు బేబీ.

కొల్లం జిల్లాలోని ప్రాక్కుళంలో జన్మించిన బేబీ, మైనా...