భారతదేశం, ఏప్రిల్ 30 -- AstraZeneca vaccine : ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా మేజర్​ యూ-టర్న్​ తీసుకుని ప్రపంచాన్ని షాక్​కు గురి చేసింది! తాము రూపొందించిన కొవిడ్​ 19 టీకాతో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంతకాలం చెబుతూ వచ్చిన ఆ సంస్థ.. ఇప్పుడు.. అరుదైన సైడ్​ ఎఫెక్ట్​ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. దాని పేరు థ్రాంబోసిస్​ విత్​ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్​ (టీటీఎస్​) అని వెల్లడించింది. టీకాలు వెలువడిన తర్వాత.. తొలిసారిగా ఇన్​-కోర్ట్​ డాక్యుమెంట్స్​లో ఈ విషయాన్ని అంగీకరించింది ఆస్ట్రాజెనెకా.

ఆస్ట్రాజెనెకా రూపొందించిన కొవిడ్​ టీకాను.. కోవిషీల్డ్​ పేరుతో ఇండియాలో విక్రయించింది సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. దేశవ్యాప్తంగా చాలా మంది ఈ టీకాను తీసుకున్నారు.

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీతో కలిసి ఈ కోవిషీల్డ్​ టీకాను రూపొందించింది ఆస్ట్రాజెనెకా. కానీ.. ఈ టీకా...