భారతదేశం, మార్చి 13 -- హీరో నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన కోర్ట్ మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియ‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప్రియ‌ద‌ర్శి, శివాజీ, రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి రామ్ జ‌గ‌దీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోర్టు రూమ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? నిర్మాత‌గా నానికి హిట్టు ద‌క్కిందా? లేదా? అంటే?

చందుతో (రోష‌న్‌) జాబిలికి (శ్రీదేవి) ఓ ఫోన్‌కాల్ ద్వారా ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. ఒక‌రినొక‌రు ప్రాణంగా ఇష్ట‌ప‌డుతుంటారు. త‌క్కువ కులం వాడిని జాబిలి ప్రేమించ‌డం ఆమె బావ మంగ‌ప‌తికి (శివాజీ)న‌చ్చ‌దు. త‌మ అమ్మాయిని రేప్ చేశాడ‌ని చందును పోక్సో కేసులో ఇరికిస్తాడు.

మంగ‌ప‌తి డ‌బ్బు, ప‌లుకుబ‌డి కార‌ణంగా చందు త‌ర‌ఫున వాదించ‌డానికి లాయ‌ర్లు ఎవ‌రు ముందుకు రారు. చందుకు శిక్ష‌ప‌డే టైమ్‌లోనే...