భారతదేశం, ఏప్రిల్ 12 -- తెలుగు లీగల్ డ్రామా సినిమా 'కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ' థియేటర్లలో దుమ్మురేపింది. రామ్ జగదీశ్ దర్శకత్వంలో ప్రియదర్శి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ అంచనాలను మించి కలెక్షన్లు సాధించింది. బ్లాక్‍బస్టర్ కొట్టిన కోర్ట్ చిత్రం నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ఈ సినిమా సత్తాచాటుతోంది. స్ట్రీమింగ్‍లో ఓపెనింగ్ అదిరిపోయింది. ఆ వివరాలు ఇవే..

కోర్ట్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఒక్క రోజులోనే ఇండియా వ్యాప్తంగా ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చేసింది. ఈ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. 24 గంటలలోపే నేడు (ఏప్రిల్ 12) నేషనల్ వైడ్‍లో నెట్‍ఫ్లిక్స్ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు చేరుకుంది.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో కోర్ట్ సినిమా హవా చూపిస్తుం...