Hyderabad, మార్చి 14 -- Court OTT Release: భిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ నిర్మాతగానూ రాణిస్తున్న నటుడు నాని తాజాగా కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే మూవీని తీసుకొచ్చాడు. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఖరారయ్యాయి. వచ్చే నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.

ప్రియదర్శి నటించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. సీనియర్ నటుడు శివాజీ విలన్ గా నటించాడు. ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు కూడా వచ్చిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక టీవీ హక్కులను ఈటీవీ సొంతం చేసుకోవడం విశేషం. ఓ చిన్న సినిమాగా రిలీజైనా.. నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో క...