భారతదేశం, ఏప్రిల్ 9 -- తెలుగు లీగల్ డ్రామా మూవీ 'కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడీ' సినిమా కమర్షియల్‍గా సూపర్ హిట్ అవటంతో పాటు చాలా ప్రశంసలను దక్కించుకుంది. పోక్సో కేసు లాంటి సెన్సిటివ్ అంశంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చట్టాల గురించి తెలిపే ఇలాంటి సినిమాలు రావాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన కోర్ట్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ అయింది. మంచి సినిమాగానూ గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఓటీటీలోకి కోర్ట్ సినిమా ఐదు భాషల్లోకి వస్తోంది. దీంతో మంచి పాయింట్‍తో వచ్చిన ఈ చిత్రం నేషనల్ వైడ్‍గా ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందోననే ఆసక్తి ఉంది.

కోర్ట్ సినిమా మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ...