భారతదేశం, మార్చి 16 -- కథను నమ్మి సినిమాను నిర్మించే నేచురల్ స్టార్ నాని ప్రోడ్యూసర్ గా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రొడక్షన్ హౌస్ 'వాల్ పోస్టర్ సినిమా' నుంచి 'కోర్ట్- స్టేట్ వర్సెస్ ఏ నోబడి'' మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాజిటివ్ రివ్యూస్, మౌత్ టాక్ తో ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ మూవీతో నాని జాక్ పాట్ కొట్టేశారనే చెప్పొచ్చు.

మార్చి 14న హోలీ సందర్భంగా థియేటర్లకు వచ్చిన 'కోర్ట్' మూవీ రెండు రోజుల్లో రూ.15.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కలెక్షన్స్ సాధించినట్లు ప్రకటించారు. బ్లాక్ బస్టర్ జస్టిస్ దక్కిందని వాల్ పోస్టర్ సినిమా ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేసింది. ప్రీమియర్స్, డే 1 కలుపుకొని ఈ మూవీ రూ.8.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సండే (మార్చి 16) కావడంతో మూడో రోజు క...