భారతదేశం, మార్చి 15 -- ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన 'కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ' చిత్రంపై మొదటి నుంచే మంచి హైప్ ఉంది. నేచురల్ స్టార్ నాని ఈ మూవీకి నిర్మాత కావడమే ఇందుకు కారణం. అందులోనూ ఈ మూవీ ప్రమోషన్లలో నాని స్పీచ్‍లు మరింత అంచనాలు పెంచాయి. కోర్ట్ సినిమా శుక్రవారం (మార్చి 14) థియేటర్లలో రిలీజైంది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీకి అంచనాలకు మించి తొలి రోజు కలెక్షన్లు దక్కాయి.

కోర్ట్ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ప్రీమియర్లతో కలిపి ఈ లెక్క వచ్చింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (మార్చి 15) అధికారికంగా వెల్లడించింది. "కోర్ట్ సినిమాకు బ్లాక్‍బస్టర్ తీర్పు వచ్చేసింది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు కోర్టు చిత్రం రూ.8.10 కోట్ల వరల్డ్ వై...