Hyderabad, మార్చి 13 -- Court Director Ram Jagadeesh About Nani And Pocso Act Cases: నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం 'కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ'. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా.. దీప్తి గంటా సహా నిర్మాతగా ఉన్నారు.

ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, బిగ్ బాస్ శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, సురభి తదితురులు నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా విలేకరుల సమావేశంలో కోర్ట్ డైరెక్టర్ రామ్ జగదీష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.

-ఈ కథ పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నిజ జీవితంలో ఇలాంటి ఒక కేసుని నేను పరిశీలించాను. ఆ కేసు గురించి తెలు...