భారతదేశం, ఫిబ్రవరి 14 -- Courier Scams : ఇటీవల కాలంలో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. మీ కొరియర్ లో అక్రమ వస్తువులు ఉన్నాయంటూ ఫోన్ చేసి డబ్బు కాజేసేందుకు ప్రయత్నిసున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రముఖ కొరియర్ సంస్థ ఫెడెక్స్... ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఫెడెక్స్ ఉద్యోగుల పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తరహా మోసాలతో బాధితులు ఆర్థికంగా, మానసిక నష్టపోతున్నారని పేర్కొంది.

ఆర్థిక మోసగాళ్లు ఫెడెక్స్ లేదా ఇతర కొరియర్ సంస్థల ప్రతినిధులుగా చెబుతూ... మీ పార్సెల్‌లో అక్రమ వస్తువులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తారు. బాధితులను నకిలీ పోలీస్ అధికారులతో బెదిరించి, న్యాయపరమైన చర్యలు లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటే తక్షణమే డబ్బ...