Hyderabad, మార్చి 1 -- మనదేశంలో ఖరీదైన పంటల్లో కుంకుమ పువ్వు ఒకటి. దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ అన్నిచోట్లా పండదంటారు. కాశ్మీర్లో పండే కుంకుమ పువ్వుకి ఎక్కువ విలువ ఉంటుంది. నిజానికి జాగ్రత్తగా పండిస్తే కాశ్మీరీ కుంకుమపువ్వు ఇంట్లో కూడా పండించవచ్చని నిరూపించింది నాగపూర్ జంట. వారి పేరు అక్షయ్ హోలే, దివ్య హోలే. వీరిద్దరూ కలిసి ఏడాదికి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కుంకుమపువ్వు పండించడం కోసం ఇంట్లోనే ఏరోపోనిక్స్ సిస్టమ్ లో ఏర్పాటు చేశారు.

కుంకుమపువ్వు సున్నితమైన రుచిని, శక్తివంతమైన రంగును కలిగి ఉంటుంది. సాంప్రదాయకంగా దీన్ని కాశ్మీర్లోని చల్లని వాతావరణంలో పండిస్తారు. చల్లని శీతాకాలంలో, పొడి వేసవిలో ఈ పంట అధికంగా పండుతుంది. అయితే అక్షయ్, దివ్య కలిసి నాగపూర్ లోని వేడి ప్రాంతంలో కుంకుమపువ్వును పండించాలని నిశ్చయించుకున్నారు. దీనికోస...