Hyderabad, మార్చి 19 -- భారతీయ వస్త్రాలు ఖరీదైనవి. ఎంతో విలాసవంతమైన వారసత్వాన్ని కలిగి ఉంటాయి. మన దేశంలో చేతితో నేసిన చీరలు కూడా ఎన్నో. వాటిని ఇప్పటికీ మనం విదేశాలకి ఎగుమతి చేస్తున్నాం. వీటి వెనక గొప్ప చరిత్ర ఉంది. అలాంటి అద్భుతమైన ఖరీదైన చీరల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి బంగారం కంటే విలువైనవిగా చెప్పుకుంటారు. వీటి నేత పద్ధతులు, డిజైన్లు, అల్లికా కూడా అద్భుతంగా ఉంటుంది.

పెళ్లిళ్లకు ఖచ్చితంగా కాంచీపురం పట్టు చీర ఉండాల్సిందే. ఇది చాలా ఖరీదైనది. కొన్ని కొన్ని చీరలు లక్షల్లో ఉంటాయి. ఇక బంగారు తీగలతో నేస్తే కోటి రూపాయలు ఖరీదు కూడా ఉంటుంది. కాంజీవరం చీరను నేయడం చాలా కష్టం. శ్రమతో కూడిన నేత ప్రక్రియ ఇది. అధిక నాణ్యత గల స్వచ్ఛమైన మల్బరీ పట్టును తీసుకొచ్చి నిజమైన జరీతో ఈ చీరను నేస్తారు. ఒక చీర నేయడానికి నెల రోజులు పడుతుంది. అందుకే కాంచీపురం చీరలో బ...