Hyderabad, ఏప్రిల్ 9 -- వేసవిలో రుచికరమైన, చల్లని మామిడిపండు తింటుంటే కలిగే కిక్కే వేరు. దీన్ని ఆస్వాదించడానికి చాలా మంది సమ్మర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుంటారు కూడా. ఎంతో మంది ఇష్టంగా తినే మామిడిపండు రుచిలో మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మామిడిపండులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ C, చర్మం, కళ్ల ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ A, బీటా-కారోటిన్ కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, హృదయ ఆరోగ్యానికి పోటాషియం, ఎముకల బలానికి విటమిన్ K అందిస్తుంది.శక్తిని పునరుద్ధరించడం, రక్తహీనతను నివారించడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మామిడి ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీన్ని సరైన పరిమాణంలో, సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి హాని కలుగుతుందట. మామిడి పండు తినడానికి సరైన పద్ధతేంటో తెలుసుకుండాం రండి.

చ...