భారతదేశం, డిసెంబర్ 8 -- ఫార్మా సంస్థ కరోనా రెమెడీస్ ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) సబ్‌స్క్రిప్షన్ డిసెంబర్ 8, సోమవారం ఓపెన్​ అయ్యింది. ఈ ఇష్యూ డిసెంబర్ 10, బుధవారం నాడు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కరోనా రెమెడీస్​ ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​, జీఎంపీ, అప్లై చేయాలా? వద్దా? నిపుణుల అభిప్రాయాలు వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

ప్రైజ్​ బ్యాండ్​: ఈ ఐపీఓ ఈక్విటీ షేరు ధర రూ. 1,008 నుంచి రూ. 1,062 గా నిర్ణయించారు.

కనీస పెట్టుబడి: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 14 షేర్ల (ఒక లాట్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ వద్ద దీనికి రూ. 14,868 పెట్టుబడి అవసరం. ఆ తర్వాత 14 షేర్ల మల్టిపుల్స్​లో బిడ్లు వేయవచ్చు.

ఇష్యూ పరిమాణం: ఈ రూ. 655.37 కోట్ల విలువైన ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) రూపంలో ఉంది. ఇందులో 0.62 కోట్ల షేర్లను విక్రయి...